ర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ పునరాగమనంతో ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠంగా మారిందని టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 2018-19 భారత జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆసీస్ గడ్డపై ఆసీస్‌ను ఓడించి టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో జాతీయ జట్టుకు దూరమైన ఆ ఇద్దరు ఆటగాళ్లు తిరిగి రావడంతో ప్రస్తుతం ఆ జట్టు బలంగా మారింది. అయితే ఈ ఏడాది చివర్లో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా ఆసీస్ వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. `న్యూజిలాండ్ సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. గాయం కారణంగా కివీస్‌లో టెస్టు ఆడలేకపోయా. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. వాళ్లిద్దరి (స్మిత్, వార్నర్) రాకతో ఆసీస్ జట్టు రూపం మారిపోయింది. టెస్టు ఓపెనర్‌గా ఆటను ఆస్వాదిస్తున్నా` అని రోహిత్ వివరించాడు.