తెలంగాణ పోలీసులను మెచ్చుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌

 కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ పోలీసులను టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ మెచ్చుకున్నారు. మనం ఇండ్లలో సురక్షితంగా ఉండేందుకు పోలీసులు విరామం లేకుండా పని చేస్తున్నారు. మనకు అవసరమైన నిత్యావసర వస్తువులను పోలీసులు ఇంటికి తీసుకువస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పోలీసులకు మనమంతా మద్దతు తెలపాలి. పోలీసులను మెచ్చుకోవాలని కోరుతూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.